జిన్‌పింగ్ తో భేటీ కానున్న మోడీ

వాస్తవం ప్రతినిధి: కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ లో జూన్ 13-14 తేదిల్లో షాంఘై సహకార సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ సదస్సు సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతారని తెలిపింది. బిష్కెక్ లో జరిగే సమావేశంలో జిన్‌పింగ్, మోడీలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని చెప్పారు.