యువరాజ్‌సింగ్‌పై సెహ్వాగ్‌ ఎమోషనల్ ట్వీట్

వాస్తవం ప్రతినిధి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డాషింగ్‌ ప్లేయర్‌ యువరాజ్‌సింగ్‌పై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశంసలు కురిపించాడు. యువరాజ్‌ వంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారని పేర్కొంటూ ఓ ట్వీట్‌ చేశాడు. ‘ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ.. యువరాజ్‌ వంటి ఆటగాళ్లు చాలాచాలా అరుదు. తన కెరీర్‌లో ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. భయంకరమైన వ్యాధిని జయించాడు. బౌలర్లను చీల్చిచెండాడు. ఎన్నో హృదయాలను గెలుచుకున్నాడు. పోరాట ప‌టిమ‌, ప‌ట్టుద‌ల‌తో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు’ అని ట్వీట్‌ చేశాడు సెహ్వాగ్‌.