రవి ప్రకాష్ కేసులో కొత్త ట్విస్ట్..!

వాస్తవం ప్రతినిధి: టీవీ9 రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు రోజుకో విధంగా మలుపులు తిరుగుతుంది. ఇటీవలే అజ్ఞాతం వీడి విచారణకు హాజరైన రవి ప్రకాష్ విచారణలో పోలీసుల ముందు ఒకలా మీడియా ముందు ఒకలా వ్యవహరిస్తున్నారని కామెంట్ వినబడుతున్నాయి. ఈ క్రమంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కేసు విషయంలో కోర్టు ఏమి చెబితే ఆ పని చేస్తామని సైబర్ క్రైమ్ ఎసిపి శ్రీనివాస్ తెలిపారు. అయితే రవిప్రకాష్ విచారణఖు సహకరించడం లేదని ఆయన స్సష్టం చేశారు. రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు సాంకేతిక ఆధారాలున్నాయని ఆయన వెల్లడించారు. మూడు రోజులుగా విచారిస్తున్నా రవిప్రకాష్ ఎలాంటి సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. అలంద మీడియా కేసులో అన్ని కోణాల్లో రవిప్రకాష్‌ను ప్రశ్నించామని, రవిప్రకాష్‌ సమాధానాలను రేపు కోర్టుకు సమర్పిస్తామని ఆయన తెలిపారు. కోర్టు ఉత్తర్వులను బట్టి రవిప్రకాష్‌ అరెస్ట్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రవిప్రకాష్ కేసు కొత్త ట్విస్ట్ లోకి వెళుతుందా?