బిగ్ బాస్ సీజన్ 3 కి రేణు దేశాయ్..?

వాస్తవం సినిమా: బిగ్ బాస్ మూడవ సీజన్ లో కేవలం సెలబ్రిటీలను మాత్రమే తీసుకోవాలని షో నిర్వాహకులు ముందునుండి అనుకుంటున్నారట. ముఖ్యంగా రెండో సీజన్లో సెలబ్రిటీలు లేకపోవడంతో కంటెస్టెంట్ లు కొత్తవారు రావడంతో రెండవ సీజన్ అలరించలేకపోయింది అని ఇన్సైడ్ టాక్ రావడంతో… బిగ్ బాస్ సీజన్ 3 లో ఎక్కువగా సెలబ్రిటీలే ఉండేటట్లు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో రాబోయే మొదలయ్యే సీజన్ 3 లో యాంకర్ గా నాగార్జున ని ఖరారు చేసినట్లు ఫిలింనగర్ టాక్. అంతేకాకుండా తాజాగా మొదలయ్యే సీజన్లో శ్రీముఖి,రఘు మాస్టర్ వైవా హర్ష ప్రముఖ సినీ నటుడు జాకీ అలాగే హీరో వరుణ్ సందేశ్ ఇలా చాలా మంది ప్రముఖ నటుల పేర్లే వినిపించాయి. అయితే ఇప్పుడు కొత్తగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా హౌస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే మరో పక్క రేణు పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని మరికొంత మంది కూడా అంటున్నారు.మరి ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అసలు మ్యాటర్ ఏమిటి అన్నది కూడా తేలిపోతుంది అని బిగ్ బాస్ ప్రేమికులు కూడా అనుకుంటున్నారు.