రెండవరోజు కొనసాగుతున్న కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క దీక్ష

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్‌ నగరంలోని ఇందిరాగాంధీ పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ దీక్ష కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క నిన్న దీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. మొదట 36 గంటల దీక్షగా టీ కాంగ్రెస్‌ ప్రకటించింది. కాగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీక్ష మధ్యలో ఆమరణ నిరాహార దీక్షగా ప్రకటించారు. సాయంత్రానికి దీక్షపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.