కాన్వెంట్‌ స్కూల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి

వాస్తవం ప్రతినిధి: హర్యానాలోని ఫరీదాబాద్‌లో దబువా కాలనీలో ఉన్న ఎఎన్‌డి కాన్వెంట్‌ స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. ఈ స్కూల్‌ కింద భాగంలో దుస్తుల గోడౌన్‌ ఉంది. మంటలను అదుపులోకి తెచ్చారని, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు చెప్పారు.