తల్లిగా నటిస్తున్న శ్రేయ..!

వాస్తవం సినిమా: ఇష్టం సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టిన హీరోయిన్ శ్రేయ సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తూ బడా బడా హీరోలందరితో నటించడం జరిగింది. ఒక సౌత్ ఇండస్ట్రీ లోనే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రేయ…ఇటీవల రష్యా దేశానికి చెందిన బిజినెస్ మాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటువంటి క్రమంలో సినిమాలకు ఇంకా దూరమైపోతుంది శ్రేయ అని అనుకున్న సమయంలో ఐ యాం బ్యాక్ అంటూ వరుసగా సినిమాలు ఇప్పుడు ఒప్పుకుంటోంది. తాజాగా తెలుగులో ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయనుందని సమాచారం. చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ కథ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శ్రియ పదేళ్ల పాపకు తల్లిగా కనిపిస్తుందని తెలుస్తోంది. గతంలో శ్రియ గౌతమీపుత్ర శాతకర్ణి, గోపాల గోపాల సినిమాల్లో తల్లిపాత్రల్లో మెప్పించింది. ముందుగా ఈ సినిమాను పూర్తి చేసేసి, ఆ తరువాతనే నితిన్ తో కలిసి చంద్రశేఖర్ యేలేటి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.