దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది భారతీయులు మృతి

వాస్తవం ప్రతినిధి: దుబాయ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 8 మంది భారతీయులు మృతి చెందారు. దుబాయ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగిందని 8 మంది భారతీయులు మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు ఈ ప్రమాదంలో గాయపడిన భారతీయుల్లో నలుగురికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జి చేశారని, మరొక ముగ్గురు రషీద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారు చెప్పారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలకు సమాచారాన్ని అందించడానికి మరిన్ని వివరాలు అందాల్సి ఉందని వారన్నారు.