అమెరికాలో విశాఖపట్నంకు చెందిన యువకుడు మృతి

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని ఓ సరస్సులో విశాఖపట్నంకు చెందిన యువకుడు గల్లంతు కావడం అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ టౌన్‌షిప్‌కు చెందిన వెంకటరావు కుమారుడు అవినాష్‌.. ఐదేళ్ల క్రితం ఎంఎస్‌ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి అవినాష్ సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృతిచెందాడు. దీంతో అవినాష్ స్నేహితులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమందించారు.