తన మంత్రివర్గంలో ఆ కీలక పదవి అతనికి మాత్రమే..అంటున్న జగన్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయినా వైసీపీ పార్టీ అధినేత జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరియు సమస్యలపై అధికారులతో కలిసి చర్చించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్న జగన్..మొట్టమొదటి పదవిని తన పార్టీలో తనకు ముందు నుండి అండగా మరియు పార్టీలో కీలకంగా ఉండే విజయసాయిరెడ్డికి అప్పజెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. మొత్తం 8 కమిటీలు – పలు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులు కావడం విశేషం. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధర్మానా కృష్ణదాస్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. క్రీడాకారుడిగా యవ్వనంలో ఉన్నప్పుడు కృష్ణదాస్ పేరొందాడు. అందుకే ఆయనకు ఈ క్రీడల సంఘానికి అధ్యక్షుడిగా నియమించడం విశేషం.ఇలా జగన్ ప్రభుత్వం వచ్చాక జరిగిన తొలి సంఘం నియామకంలో తొలి పదవి జగన్ సన్నిహితుడికే లభించడం విశేషంగా మారింది.