జమ్ము కాశ్మీర్‌లో పోలీసులకు లొంగిపోయిన ఐదుగురు ఉగ్రవాదులు

వాస్తవం ప్రతినిధి: జమ్ము కాశ్మీర్‌లోని కుల్గాంలో ఐదుగురు యువకులు ఉగ్రవాదాన్ని వీడి పోలీసులకు లొంగిపోయారు. ఆ యువకుల కుటుంబ సభ్యులు, పోలీసులు చేసిన కృషి వల్ల వారు ఉగ్రవాదాన్ని విడనాడారని పోలీసులు చెప్పారు. అయితే భద్రతా కారణాల రీత్యా వారి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. 2017నుంచి డజన్ల కొద్దీ మిలిటెంట్లు జన జీవన స్రవంతిలోకి వచ్చారని పోలీసులు చెప్పారు