జగన్ మీ నాన్న పేరు నిలబెట్టాలని కోరుతున్నాం : కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ ..రాష్ట్ర నడిబొడ్డు విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మే 30 వ తారీకున మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ …సభలో జగన్ ఉద్దేశించి అద్భుతంగా ఆసక్తికరంగా ప్రసంగించారు. అతి చిన్న వయసులోనే పెద్ద బాధ్యత మీకు అప్పగించబడింది..దానిని నిలబెట్టుకోవాలని..గత తొమ్మిది సంవత్సరాలు మీ రాజకీయ జీవిత ప్రయాణం గమనిస్తే…మీరు చాలా ఎదుర్కొని ఈ స్థాయిలో కి వచ్చారు. కాబట్టి చిన్న వయసులోనే మీకు పెద్ద బాధ్యత అప్పగించబడింది..మీరు సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సంతోషాన్ని ఇవ్వాలని…నాన్నగారు వైఎస్ పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార సభలో తెలుగు రాష్ట్రాల మధ్య నదుల సమస్యను కేసీఆర్ ప్రస్తావించారు. కృష్ణా నదిలో తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలున్నాయన్న కేసీఆర్.. అక్కడ లభించే ఒక్కో నీటిబొట్టును ఒడుపుగా, ఒద్దికగా.. కలిసి వినియోగించుకోవాలని.. సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో.. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి అంగుళం సస్యశ్యామలం చేసుకోవాలని ఆకాంక్షించారు. కర్తవ్య నిర్వహణలో అవసరమైన అండదండలు సహాయక సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని తెలియజేస్తుందన్నారు. జగన్ కు జనం అద్భుతమైన అవకాశం ఇచ్చారనీ.. సద్వినియోగం చేసుకుని నాన్న పేరు నిలబెట్టి… చరిత్రలో నిలిచిపోయేలా కీర్తిప్రతిష్టలు సంపాదించాలని కెసిఆర్ అన్నారు.