మంత్రివర్గంలో కీలక మార్పులు చేసిన మమతా బెనర్జీ

వాస్తవం ప్రతినిధి: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మంత్రివర్గంలో మార్పులు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సంతృప్తికరమైన ఫలితాలు పొందకపోవడంతో ఆమె మంత్రివర్గంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ట్రాన్స్‌పోర్టు మంత్రి సువేందు అధికారికి అదనంగా ఇరిగేషన్‌, వాటర్‌ రీసోర్స్‌ ఇన్వెస్టిగేష్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ శాఖలను అప్పగించినట్లు మమతా బెనర్జీ చెప్పారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లండ్‌ బయోటెక్నాలజీ శాఖ మంత్రి బ్రత్యా బసుకు అదనంగా అటవీ శాకను అప్పగించినట్లు ఆమె చెప్పారు. అలాగే మరికొన్ని మంత్రిపదవుల్లోనూ మార్పులు చేసినట్లు ఆమె వివరించారు.