303 మంది బీజేపీ ఎంపీల్లో ముస్లింలు ఎంతమందో మోదీగారు చెప్పాలి: ఒవైసీ

వాస్తవం ప్రతినిధి: మైనారిటీలు దేశంలో భయంలేకుండా జీవించే పరిస్థితి రావాలి అని మోడీ అనడాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. దేశంలో ముస్లింలు నిజంగా భయం లేకుండా జీవించాలని మోడీ భావిస్తున్నట్లైతే…303 మంది బీజేపీ ఎంపీల్లో ముస్లింలు ఎంతమందో ఆయన చెప్పాలని సవాల్ చేశారు. మోడీ మాటలన్నీ కపటత్వంతో కూడుకున్నవని, ఆయన మాటలన్నీ పరస్పర వైరుధ్యంతో కూడుకుని ఉంటాయనీ విమర్శించారు. మోడీ, ఆయన పార్టీ గత ఐదేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు అదేనని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. నిజంగా ముస్లింలు దేశంలో నిర్భయంగా బతకాలని ఆయన భావిస్తే గోరక్షణ పేర మైనారటీలపై జరుగుతున్న దాడులను ఆపేస్తారా? అని ప్రశ్నించారు.