16వ లోక్‌సభను రద్దుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్

వాస్తవం ప్రతినిధి: 16వ లోక్‌సభను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి మండలి చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపారు భారత రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్… దీనికి సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 యొక్క నిబంధన (2) సబ్ క్లాజు (బి) ద్వారా తనకు ఉన్న అధికారాలతో 16వ లోక్‌సభను రద్దుచేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కాగా, శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో 16వ లోక్‌సభను రద్దుకు తీర్మానం చేసినసంగతి తెలిసిందే.