ఉత్తరప్రదేశ్ లో దారుణం.. బీజేపీ నేత దారుణ హత్య

వాస్తవం ప్రతినిధి: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది.ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో ఆదివారం తెల్లవారుజామున బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సురేంద్రసింగ్ అనే బీజేపీ నేతను తుపాకీతో కాల్చి చంపారు. జాము పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత స్మృతి ఇరానీకి సన్నిహితుడిగా భావిస్తున్న ఈయన హత్య స్థానికంగా కలకలం రేపింది.

  ఇంట్లో నిద్రిస్తున్న సురేంద్ర సింగ్‌పై .. దుండగులు కాల్పులు జరపడంతో.. తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు అతన్ని లక్నోలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.