ప్రధానితో సమావేశం అనంతరం అమిత్ షా తో భేటీ అయిన జగన్

వాస్తవం ప్రతినిధి: వైసీపీ శాసనసభపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ప్రధాని మోదీతో సుమారు గంటపాటు సమావేశమైన అనంతరం ఆయన అమిత్ షా నివాసానికి వెళ్లారు. తిరిగి రెండో సారి అధికారంలోకి వచ్చినందుకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 30న విజయవాడలో జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా ఆహ్వానించారు.