ఈ రాత్రికి తిరుపతిలో బస చేయనున్న కేసీఆర్, జగన్.?

వాస్తవం ప్రతినిధి: నేడు ప్రధానితో చర్చల అనంతరం న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో కాసేపు గడిపి, అక్కడి అధికారులతో, తెలుగువారితో సమావేశమైన తరువాత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా తిరుపతికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రికి ఆయన తిరుపతిలోనే బస చేయనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇక ఆయన తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకుంటారా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు.

కాగా, నేటి సాయంత్రం తెలంగాణ సీఎం కుటుంబ సమేతంగా తిరుపతికి చేరుకుని, ఆపై తిరుమలకు వెళ్లి, రాత్రికి అక్కడే ఉండి, రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వరుని దర్శించుకోనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కూడా తిరుపతికి వెళ్లనుండటం గమనార్హం.