జగన్‌తో భేటీపై ప్రధాని మోడీ ట్వీట్‌

 వాస్తవం ప్రతినిధి: వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీపై ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నాను’ అని ట్వీట్‌లో పోస్ట్‌ చేశారు. ఇవాళ ఢిల్లీలో మోడీ-జగన్‌ భేటీ దాదాపు 20 నిమిషాలపాటు జరిగింది.