తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని కలిసి ఆహ్వానించిన జగన్‌

వాస్తవం ప్రతినిధి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. అలాగే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానమంత్రి మోదీతో జగన్ చర్చించినట్లు సమాచారం.

ఇకపోతే వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ వైయస్ జగన్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అఖండ విజయం సాధించారని కొనియాడిన సంగతి తెలిసిందే.