పోలవరం ప్రాజెక్టు గురించి సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్న వైసీపీ పార్టీ..?

వాస్తవం ప్రతినిధి: విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు వ్యవసాయంపై ఆధారపడిన ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఆయువుపట్టు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొంత కాలం నుండి పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి రాజకీయాల్లో అనేక పార్టీలు వివిధ తీర్మానాలు చేస్తూ ఏపీ రైతాంగానికి వరాలు కురిపించారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒక్క వైఎస్ఆర్ తప్ప మిగతా ముఖ్యమంత్రులంతా పెద్దగా సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవు. అయితే తాజాగా నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన వైసీపీ పార్టీ మాత్రం మొట్ట మొదటి దశలోనే పోలవరం ప్రాజెక్టు విషయమై మరియు ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం అనేక సంచలన నిర్ణయాలు జగన్ తీసుకోబోతున్నట్లు పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. అంతే కాకుండా ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయిన జగన్ నిర్వహించిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని బందరు నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యుడు వి.బాలశౌరి కోరారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ కల అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిదులు తేవడం కాని, కాల్వలు తవ్వించడం కాని ఆయనే చేశారని ,అందువల్ల వైఎస్ పేరు పెట్టాలని ఆయన కోరారు. జగన్ పై విశ్వాసం వల్లే భారీగా ఆదిక్యత ఇచ్చారని ఆయన అన్నారు. కాగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి కూడా పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలని కోరారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టునుపూర్తి అవుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.