వైసీపీ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్..!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిన వైసీపీ పార్టీ అధినేత జగన్ గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తాడేపల్లి ప్రాంతంలో పార్టీ కార్యాలయంలో వైసిపి పార్టీ తరఫున నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలతో మరియు ఎంపీలతో భేటీ అయిన జగన్ భవిష్యత్ రాజకీయాల గురించి మరియు ఎన్నికల్లో గెలిచిన విధానం గురించి నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. శనివారం ఉదయం నాడు జరిగిన ఈ సమావేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా జగన్ ను తమ నేతగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. ఈ తీర్మానం ప్రతినిధిని గవర్నర్ నరసింహన్ కు ఎమ్మెల్యేల బృందంతో కలిసి జగన్ అందచేస్తారు. ఆ తర్వాత ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ ఆహ్వానిస్తారు. విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్దం అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తర్వాత జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసేఅవకాశం ఉందని వార్తలు వచ్చాయి.