షాకింగ్ కామెంట్స్ చేసిన మమతా బెనర్జీ..!

.వాస్తవం ప్రతినిధి: ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలని అనుకోవడం లేదని ప్రకటించారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని.. పార్టీ గుర్తు ముఖ్యమని మమతాబెనర్జీ స్పష్టం చేశారు. తాను ఆరు నెలలు పని చేయలేకపోయానని పార్టీకి చెప్పినట్లు ఆమె తెలిపారు. బెంగాల్ రాష్ట్రంలో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకు గానూ తృణమూల్ కాంగ్రెస్ 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 18 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ 2 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది.