డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

వాస్తవం ప్రతినిధి: టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8 మందిని కనెక్ట్ చేసుకావచ్చు. కాగా గూగుల్ ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది.

గూగుల్ తయారు చేసిన ‘డుయో’ యాప్ ప్రారంభంలోనే రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఫ్రీ డౌన్‌లోడ్స్ విభాగంలో డుయో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. పోకేమాన్‌గో, ఫేస్‌బుక్ మెసెంజర్‌లను యాప్‌లను వెనక్కినెట్టింది.ఈ వీడియో కాలింగ్ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. 4.5 రేటింగ్‌తో ఆగ్రస్థానంలో డుయో యాప్, 4.0 రేటింగ్‌తో రెండో స్థానంలో ఫేస్‌బుక్, 3.9 రేటింగ్‌తో మూడో స్థానంలో మెసెంజర్‌లు నిలిచాయి.

రూ. 9 వేల మొత్తాన్ని

గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టిన వీడియో కాలింగ్ యాప్ డుయోని ఇన్స్టాల్ చేసుకుని స్నేహితులకు రిఫర్ చేయడం ద్వారా దాదాపు రూ. 9 వేల మొత్తాన్ని యూజర్లు సొంతం చేసుకోవచ్చు.అయితే ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండీషన్స్ ని ప్రవేశపెట్టింది. ఈ రకమైన ఆఫర్ ను మొదటగా ఫిలిప్ఫీన్స్ దేశంలో ప్రవేశపెట్టింది. గూగుల్ క్యాష్ రివార్డు పోగ్రాం కింద గూగుల్ డుయో ద్వారా డబ్బును సంపాదించుకునే అవకాశాన్ని ఇప్పుడు ఇండియన్లకు కూడా కల్పించింది.