బీజేపీ ప్రభుత్వానికి అమెరికా అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుంది: ట్రంప్

వాస్తవం ప్రతినిధి:  17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే భారీ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల అధినేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుండగా అమెరికా అధ్యక్షుడు కూడా తన అభినందనలను ట్విట్టర్‌లో ఉంచారు. మోదీ హయాంలో భారత్‌తో అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్‌ అభివృద్ధికి మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికి అమెరికా అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఇరుదేశాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో పరస్పరం సహకరించుకుందామని ఆకాంక్షించారు.