కోహ్లీ ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాడంటూ కొనియాడిన విండీస్ క్రికెట్ దిగ్గజం

వాస్తవం ప్రతినిధి: కేవలం టీమిండియా మాజీలే కాకుండా విదేశీ దిగ్గజాలు కూడా కోహ్లీ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా కోహ్లీ ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాడంటూ కొనియాడారు.

”విరాట్ కోహ్లీ ఓ మిషన్. అతడి ఆటతీరు చాలా డిఫరెంట్ గా వుంటుంది. ఆటగాళ్లకు ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. ఒకప్పటి ఆటగాళ్ల కంటే ఇప్పటి క్రికెటర్లకు ఇది చాలా ముఖ్యం.ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా ఫిట్ గా వున్నపుడే ఆటగాళ్లు రాణించగలరు. తన ఫిట్ నెస్ ను కాపాడుకోడానికి కోహ్లీ ఎక్కువగా కష్టపడతాడు. కాబట్టే అతడు అందరిలాగా కేవలం మనిషిగా కాకుండా…రన్ మిషన్ గా మారాడు.

జట్టుకు ఎప్పుడు అవసరం వచ్చినా తన బ్యాటింగ్ ఆదుకోడానికి కోహ్లీ ముందుటాడు. సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప ఆటగాడో కోహ్లీ కూడా అలాంటివాడే. అందివచ్చిన అవకాశాలను వాడుకుని తన అద్భుత ప్రతిభతో టెండూల్కర్ ఎంతో గౌరవంగా క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అలాంటి గౌరవాన్నే కోహ్లీ కూడా పొందుతాడు. ఇంకా చెప్పాలంటే టెండూల్కర్ కంటే ఎక్కువ టాలెంట్ ను కోహ్లీ కలిగివున్నాడు. ఇప్పటి యువ క్రికెటర్లకు అతడు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు” అంటూ కోహ్లీని లారా ఆకాశానికెత్తాడు.