లోక్ స‌భ‌లో అతి పిన్న‌వ‌య‌స్కురాలిగా అరకు ఎంపి మాధ‌వి

వాస్తవం ప్రతినిధి: అర‌కు – లోక్ స‌భ‌కు అత్యంత పిన్న‌వ‌య‌స్సులోనే స‌భ్యురాలిగా ఎన్నికై చ‌రిత్ర సృష్టించారు గొడ్డేలి మాధ‌వి.. ఆమె ఎపిలోని అర‌కు నుంచి వైసిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసి ఎంపిక‌య్యారు….ఈమె వయసు ప్రస్తుతం 25 ఏళ్ల 3 నెలలు. ఇంత చిన్న వయసులో ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు 26 ఏళ్ల 13 రోజుల దుష్యంత్ చౌతాలాపై ఉండేది. అతి పిన్న వయసులోనే ఎంపీగా గెలుపొందిన మాధవి.. అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

మాధ‌వి రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చారు… ఆంధ్రప్రదేశ్ చింతపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నాయకులు గొడ్డేటి దేముడు కుమార్తె అమె. తండ్రి దేముడు వారసత్వంగా తొలిసారిగా మాధవి రాజకీయాల్లోకి వచ్చారు. మాధవి బీఎస్సీ, బీపీఎడ్ చదివారు. వైసీపీలో చేరే కంటే ముందు కొయ్యూరులోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆమె పీఈటీగా పని చేశారు.

2018, ఆగస్టు నెలలో ఆమె వైసీపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1992లో జన్మించిన మాధవి అవివాహితురాలు. ఈమె సోదరి చెల్లయమ్మ ఎస్జీటీగా పని చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి . టిడిపి అభ్య‌ర్ధి కిషోర్ చంద్రదేవ్ పై 2,21,058 ఓట్ల మెజార్టీతో మాధ‌వి విజ‌యం సాధించారు.