జగన్ ప్రమాణ స్వీకారణ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమీక్ష

వాస్తవం ప్రతినిధి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 30వతేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారణ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డీజీపీ ఠాకూర్, విజయవాడ సీపీ, సీఆర్ డీఏ కమిషనర్ శ్రీధర్ లు పాల్గొన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే స్థలం ఖరారుపై అధికారులు చర్చిస్తున్నారు. విశాలమైన ప్రదేశంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశముంది.