వైఎస్ జగన్ కు వేదాశీర్వచనం అందించిన టీటీడీ అర్చకులు

వాస్తవం ప్రతినిధి: వైఎస్ జగన్ కు టీటీడీ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసంలో జగన్ ను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కలిశారు. అనంతరం టీటీడీ ప్రధానార్చకులు, వేదపండితులు జగన్ కు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.