మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్ కు వచ్చిన ఓట్లు ఎన్నంటే..

వాస్తవం ప్రతినిధి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా హడావుడి చేశారు. వినూత్న ప్రచారశైలితో మీడియా దృష్టిని ఆకర్షించారు. తనను గెలిపిస్తే లక్షల కోట్ల రూపాయల విరాళాలు తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పిన కేఏ పాల్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? నరసాపురం అసెంబ్లీ బరిలో నిలిచిన ఆయనకు వచ్చిన ఓట్లు 275. ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 1133.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ (పీఎస్‌పీ) ప్రభంజనం సృష్టించబోతోందని చెప్పిన కేఏ పాల్ నరసాపురం లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేశారు. అక్కడ ఆయనకు లభించిన ఓట్లు 2639. నోటాకు లభించిన ఓట్లు 10391. ఆయనకంటే కొందరు స్వతంత్ర పార్టీల అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి