బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే రాజీనామా

వాస్తవం ప్రతినిధి: బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే శుక్రవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమె ఎంతో భావోద్వేగ పూరితంగా తన రాజీనామా ప్రకటన చేశారు. తన బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతిచ్చేలా ఎంపీలను ఒప్పించలేనందుకు కన్జర్వేటివ్ పార్టీ నేతగా జూన్ 7న రాజీనామా చేయనున్నట్టు మే తెలిపారు. తన డౌనింగ్ స్ట్రీట్ నివాసం బయట పూడుకుపోతున్న గొంతుతో ‘బ్రెగ్జిట్ ను సజావుగా అమలు చేయలేకపోవడం నాకు ఎప్పటికీ విచారకరంగా ఉంటుందని’ మే అన్నారు.