భారతదేశంలో జరిగిన ఎన్నికల వార్తలను ప్రధానంగా ప్రచురించిన పాక్ మీడియా

వాస్తవం ప్రతినిధి: పాకిస్తాన్‌లోని వివిధ పత్రికలు భారతదేశంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల వార్తలను ప్రధానంగా ప్రచురించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన జాతీయ భద్రతాంశాలు, బాలాకోట్‌పై ఐఎఎఫ్‌ దాడులు తదితర అంశాలను ప్రస్తావిస్తూ పాక్‌ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.