అతడి వల్లే నాగబాబు ఓడిపోయాడు..?

వాస్తవం సినిమా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పార్లమెంటు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఓడిపోవడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఓడిపోవడం అందరికి షాక్ కు గురి చేసింది. ఇదిలా ఉండగా నర్సాపురం పార్లమెంటు స్థానంలో నాగబాబు ఓడిపోవడానికి గల కారణం మా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ని చాలామంది అంటున్నారు. అసలు విషయంలోకి వెళితే ఇటీవల జరిగిన మా ఎన్నికల సందర్భంగా నాగబాబు శివాజీ రాజకీయ ప్రత్యర్థిగా నిలబడిన సీనియర్ నరేష్ రాజశేఖర్ దంపతులకు మద్దతు తెలిపి శివాజీ రాజా ని టార్గెట్ చేసి ఆ ఎన్నికలలో ఓడ కొట్టడం జరిగింది. దీనికి బదులుగా శివాజీరాజా త్వరలో రిటర్న్ గిఫ్ట్ అందుతుందని రిటార్ట్ ఇచ్చాడు. సరే ఇదంతా మాములే అని జనం లైట్ తీసుకున్నారు కట్ చేస్తే శివాజీరాజా నాగబాబు నరసాపురం నుంచి పోటీ చేయడం గురించి ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పైసా ఖర్చు పెట్టని నాగబాబు మా సంఘం అభివృద్ధిని రెండేళ్ళు వెనక్కు తీసుకెళ్ళిన మనిషి ఇంత పెద్ద ఊరికి ఏదో చేస్తాడని ఎలా నమ్ముతారని కాస్త గట్టిగానే స్వరం వినిపించాడు. స్వతహాగా అది శివాజీరాజ స్వస్థలం కావడంతో అతని మాటకు వెయిట్ వచ్చింది. దీంతో నాగబాబుకి భారీ దెబ్బ పడిందని ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు.