యాంకర్ అనసూయ కి దారుణమైన అవమానం..!

 వాస్తవం సినిమా: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ఇటీవల వేసవి సందర్భంగా కుటుంబంతో కలిసి ఉత్తర భారతదేశం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న గుల్ మార్గ్ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి ఉన్న ప్రకృతి అందాలను మళ్లీ కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో అనసూయ విడుదల చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద వైరల్ గా మారింది. విషయంలోకి వెళితే ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్‌ను క్షమాపణలు కోరడం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. సరైన కారణం తెలీదు కానీ “స్పైస్ జెట్ సారీ కోసం ఎదురుచూస్తున్నా” అంటూ ఆమె ట్విట్ చేయడంపై సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు అనసూయకి ఎలాంటి సమస్య ఎదురైంది. ఆమె స్పైస్ జెట్ నుంచి ఎందుకు క్షమాపణలు కోరిందనే విషయం ఇంకా కూడా తెలియడం లేదు. కాగా అనసూయ ట్వీట్‌కు స్పందించిన స్పైస్ జెట్ సంస్థ… అసలు ఏం జరిగిందో తమకు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆమెకు సూచించింది. అయితే సెలవులకని వెళ్లిన అనసూయకు స్పైస్‌జెట్ సర్వీసుల్లో ఏదో ఇబ్బంది కలిగినట్టు ఉంటుందని, అందుకే తాను క్షమాపణలు కోరుతుందని పలువురు భావిస్తున్నారు.