కోలీవుడ్ స్టార్ హీరో కి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్..?

వాస్తవం సినిమా: కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ బాల తో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఎగబడుతుంటారు. ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఆయనతో ఒక్కసారైనా కలిసి పని చేయాలని ఎదురు చూస్తుంటారు. అటువంటి వ్యక్తికి అవమానం జరిగింది. ఆయన తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ఫైనల్ అవుట్ బాగాలేదని పక్కన పెట్టేశారు.మరో దర్శకుడితో సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ కూడా మూడు నెలల్లో పూర్తయింది. ఇంత ఫాస్ట్ గా సినిమా ఎలా కంప్లీట్ చేశారా..? అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదే అనుమానంతో బాలా తను తీసిన వెర్షన్ లో ఏవైనా సన్నివేశాలు వాడుకున్నారేమోనని హీరో విక్రమ్ తో పాటు నిర్మాణ సంస్థలకు నోటీసులు పంపించారట.తను తీసిన వెర్షన్ లో సన్నివేశాలను వాడుకుంటే గనుక చట్టరీత్యా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి బాలాని ప్రాజెక్ట్ నుండి తప్పించిన తరువాత హీరోయిన్ గా మరో అమ్మాయిని తీసుకున్నారు.హీరో ధృవ్ లుక్ లో మార్పులు చేశారు. ఆ ప్రకారంగా చూసుకుంటే సన్నివేశాలు వాడుకునే ఛాన్స్ లేదు. కానీ దేనికైనా మంచిదని ముందే బాలా నోటీసులు ఇచ్చేసినట్లున్నారు.