సిల్వర్ స్క్రీన్ పై త్వరలో జగన్ బయోపిక్..?

వాస్తవం సినిమా: వైసీపీ పార్టీ అధినేత జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర టైటిల్ పేరిట ఎన్నికల ముందు సినిమా చేసి రిలీజ్ చేయడం జరిగింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రని మెయిన్ లైన్ గా తీసుకుని మహి వి రాఘవ్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను రక్తికట్టించింది. యాత్ర సినిమా చూసి చాలామంది తీవ్ర భావోద్వేగానికి రావడం జరిగింది. అయితే తాజాగా ఏపీ లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధినేత జగన్ గెలవడంతో యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ్ జగన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపాడు. జగన్ తో కలసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. కంగ్రాట్స్ జగనన్నా. ఈ విజయానికి నీవు అర్హుడివి. మీ తండ్రి వైఎస్ఆర్ కంటే అద్భుతమైన పాలన అందిస్తావని ఆశిస్తున్నాను. నీవు సరికొత్త అధ్యాయాన్ని రచించావు. నీది ప్రజలకు చెప్పి తీరాల్సిన కథ అని మహి వి రాఘవ్ యాత్ర 2 అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు. దీనితో యాత్ర చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు పరోక్షంగా వెల్లడించాడు. భవిష్యత్తులో జగన్ బయోపిక్ సినిమా తీసేందుకు ఈ దర్శకుడు సన్నాహకాలు చేసుకుంటున్నట్లు దీని ద్వారా అర్థం అవుతోంది.