కశ్మీర్ లోయలో ఎదురు కాల్పులు..మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాకీర్ మూసా హతం

వాస్తవం ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో… కశ్మీర్ లోయలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు స్పందించి కాల్పులు జరపడంతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాకీర్ మూసా హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్ లో మూసా నక్కి ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ట్రాల్ ప్రాంతంలోని దాద్సర్ లోని ఓ ఇంట్లో దాక్కుండటంతో.. భద్రతా దళాలు ఇంటిని చుట్టుముట్టి.. అతన్ని లొంగిపోవాల్సిందిగా కోరారు. అయినా కూడా వినకుండా కాల్పులకు దిగడంతో.. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో జాకీర్ ముసా హతమయ్యాడు. ఘటనాస్థలిలో భారీగా రాకెట్ లాంచర్లు, ఏకే -47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.