మోడీకి శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయిల్‌ ప్రధాని

వాస్తవం ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాల్లో ఆధిక్యం సాధిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఆయన అన్నారు.