సమంతా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున…!

వాస్తవం సినిమా: ‘సోగ్గాడే చిన్నినాయన’ వంటి సినిమా తర్వాత సరైన హిట్టు రాకపోవడంతో గతంలో తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ తెరకెక్కుతున్న సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సమంత ఒక కీలక పాత్రలో కూడా నటిస్తుంది. ఈ నేపథ్యంలో సమంత పాత్రకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ను ఇటీవల జరిగిన క్రమంలో నాగార్జున తన కోడలు సమంతతో తీసుకున్న ఫోటో ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘మన్మథుడు 2’ కోసం కోడలు పిల్ల సమంతతో కలిసి పనిచేయడం అద్భుతంగా, సరదాగా ఉంది. మరిన్ని ఫొటోలు విడుదల కాబోతున్నాయి’ అంటూ నాగ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలో కారుకు ఆనుకుని ఉన్న నాగ్‌కు గొడుగు పట్టుకుని సామ్ కనిపించింది. ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఫొటోను కూడా చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. తాజాగా పోర్చుగల్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మరో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత నాగార్జున ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.