ప్ర‌పంచ‌క‌ప్‌కు ఇగ్లండు జ‌ట్టు ఇదే….

వాస్తవం ప్రతినిధి: మరికొద్ది రోజుల్లో సొంతగడ్డపై జరగనున్న ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ 15 మందితో కూడిన తుది జట్టును ప్రకటించింది.15మంది సభ్యులు గల జట్టులో అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డేలా యువ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌కు చోటు కల్పించారు. ఆర్చర్‌తో పాటు జేమ్స్‌ విన్స్‌, లియామ్‌ డాసన్‌కు చోటు దక్కగా.. డేవిడ్‌ విల్లే, అలెక్స్‌ హేల్స్‌, జోయ్‌ డెన్లీలకు ఉద్వాసన పలికారు.

 ఇంగ్లాండ్‌ జట్టు: ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో(వికెట్‌ కీపర్‌), జేమ్స్‌ విన్స్‌, జో రూట్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌), మొయిన్‌ అలీ, అదిల్‌ రషీద్‌, లియామ్‌ డాసన్‌, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ఫ్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, టామ్‌ కర్రన్‌.