ఏపీలో 48 దాటేయనున్న ఎండ, తీవ్ర వడగాల్పులు

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 25 నుండి 29 వరకు వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలలో ఎక్కువగా ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉందని.. ఉష్ణోగ్రత కూడా 48 డిగ్రీలను మించిపోనుందని ఆ నాలుగు రోజులులలో బయటకు వెళ్లకపోవడమే మంచిందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో 23 నుండి 27 మధ్య రోజులలో రాయలసీమలో ముందస్తు రుతుపవన చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.