బార్‌లో దుండగులు కాల్పులు ..11 మంది మృతి

వాస్తవం ప్రతినిధి: బ్రెజిల్‌లోని పార్‌ రాష్ట్ర రాజధాని బెలెమ్‌లో ఒక బార్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు. ఏడుగురు సాయుధులు ఈ దాడిలో పాల్గొన్నారని, వారు ఒక మోటార్‌ సైకిల్‌ మూడు కార్లలో వచ్చారని పోలీసు అధికారులు చెప్పారు.