ఫలితాలు రాకుండానే జగన్ క్యాబినెట్ ?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపు మాదే అని ధీమాగా ఉంది వైసిపి పార్టీ. పోలింగ్ ముగిశాక రాష్ట్రంలో జరిగిన అన్ని సర్వేలో దాదాపు జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే ఫలితాలు వచ్చిన నేపథ్యంలో వైసీపీ పార్టీలో ఉన్న చాలామంది నేతలు ఆశావాహులు ఇప్పుడే మంత్రి పదవులపై అసలు పెట్టేసుకున్నారు. ఇదే క్రమంలో వైయస్ జగన్ క్యాబినెట్ అంటూ పలు వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటువంటి వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. తాజాగా ఏపీ ఎన్నికలలో ఫలితాలు ఇంకా రాకముందే తాము ఈ సారి ఎలా అయిన అధికారంలోకి వస్తామనే గట్టి నమ్మకంతో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే క్యాబినెట్ మంత్రులని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. గెలుపుపై చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న జగన్ తన క్యాబినెట్ మంత్రుల లిస్టు కూడా సిద్ధం చేసి పార్టీలో అందరికి చేరవేసారనే సమాచారం వినిపిస్తుంది. తాజాగా వైసీపీ క్యాబినెట్ మంత్రుల లిస్టు ఒకటి బయటకి వచ్చింది. ఇప్పుడు ఇది కాస్తా పొలిటికల్ సర్కిల్ లో సంచలనంగా మారింది. అయితే తాజా ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పలేకపోతున్నారు. మరోపక్క వైయస్ జగన్ మాత్రం క్యాబినెట్ మినిస్టర్ లు ఇంకా తన పని తాను సైలెంట్ గా చేసుకుపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.