వరుసగా ఐదవ రోజు చందా కొచ్చర్‌ను ప్రశ్నించిన ఈడీ

వాస్తవం ప్రతినిధి: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు వరుసగా ఐదవ రోజు కూడా ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సిఇఒ చందా కొచ్చర్‌ను ప్రశ్నించారు. వీడియోకాన్‌ సంస్థకు మంజూరు చేసిన 1875 కోట్ల రూపాయిల రుణంపై ఇ.డి. అధికారులు ఆమెను, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ను ప్రశ్నిస్తున్నారు. వీడియోకాన్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌తో కొచ్చర్‌ దంపతుల వ్యాపార లావాదేవీలపై ఇ.డి. అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు.