ఫ్యామిలీతో విదేశాలకువెళ్లి సేద తీరుతున్న రోహిత్‌ శర్మ

వాస్తవం ప్రతినిధి: మొన్నటి వరకూ ఐపీఎల్‌లో బిజీగా గడిపిన రోహిత్‌ శర్మ.. ప్రపంచకప్‌ కోసం ఈనెల 22న ఇంగ్లాండ్‌ ఫ్లైట్‌ ఎక్కబోతున్నాడు. ఈ మధ్యలో దొరికిన కాస్త సమయంలో ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి సేద తీరుతున్నాడు. తన భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతోపాటు కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవుల్లో రిలాక్సవుతున్నాడు రోహిత్. ఆ టూర్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.