హీరో విశాల్ చేసిన పనికి మీరు కూడా చప్పట్లు కొట్టాల్సిందే..!

వాస్తవం సినిమా: తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పెద్ద హాట్ టాపిక్ గా మారారు. గతంలో ప్రతి సినిమా టికెట్ పై ఒక రూపాయి రైతులకు చెందాలని విశాల్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా తాజాగా ఆయన తీసుకున్న మరొక నిర్ణయం ఇప్పుడు అందరినీ చప్పట్లు కొట్టే విధంగా చేస్తోంది అనే కామెంట్లు వినబడుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే ఇటీవల విశాల్ నటించిన కొత్త సినిమా ‘అయోగ్య’ విడుదల అవటం జరిగింది. సినిమా రిలీజ్ అయిన రోజు నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది దీంతో విశాల్ టికెట్ మీదా ఒక రూపాయిని రైతుల సంక్షేమ నిధికి వెళ్లేలా నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా రేంజ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఓ 20 లక్షల టికెట్లు తెగొచ్చేమో. అంటే రైతులకు రూ.20 లక్షలు వెళ్తాయన్నమాట. ఒక హీరో తన సినిమా రిలీజయ్యే ప్రతిసారీ ఇంత మొత్తం ఇవ్వడం గొప్ప విషయమే. ఈ మంచి పనితో తాను రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా అని విశాల్ చాటి చెప్పాడు. విశాల్ గత సినిమా ‘అభిమన్యుడు’కు కూడా ఇలాగే ప్రతి టికెట్ మీదా రూపాయి తీసి రైతులకు ఇచ్చాడు. ఇకపై తన ప్రతి సినిమాకూ ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నట్లు విశాల్ ప్రకటించారు. దీంతో విశాల్ చేసిన ప్రకటనకు కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది పొగడ్తల వర్షం కురిపించారు. నిజంగా ప్రభుత్వాలు రైతులను ఒక ఓటు బ్యాంకులుగా చూస్తుంటే కేవలం ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు విశాల్ వంటి హీరోలు రైతులకు గౌరవం ఇవ్వటం శుభప్రదం కచ్చితంగా విశాల్ చేసిన పనికి ఎవరైనా చప్పట్లు కొట్టాల్సిందే.