‘మహానటి’ సినిమా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..!

వాస్తవం సినిమా: అలనాటి అందాల నటి ‘సావిత్రి’ జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని తీసిన మహానటి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో బీభత్సమైన కలెక్షన్లు సృష్టించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అప్పట్లో విడుదలైన ఈ సినిమా పై చాలామంది ప్రముఖులు సావిత్రి జీవితం పై రకరకాలుగా కామెంట్లు చేయడం జరిగింది. ఆమె చాలా త్యాగశీలి… ఉదార స్వభావం గల హీరోయిన్ అని పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది. ఇదిలావుండగా తాజాగా మహానటి సినిమాపై షావుకారు జానకి షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. తాజాగా ఆలీతో జాలీగా టాక్ షో లో పాల్గొన్న షావుకారు జానకి గారు మాట్లాడుతూ సావిత్రి జీవితాన్ని మహానటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం నాకు నచ్చలేదు – ఆమె బయోపిక్ ను తీయకుండా ఉండాల్సిందన్నారు.నేను ‘మహానటి’ చిత్రాన్ని చూడలేదు కాని సినిమాలో ఆమె గురించి బాధాకరమైన విషయాలు చూపించారని తెలిసింది. ఆ సీన్స్ చూపించారని తెలిసి బాధ కలిగింది. నా మాటలు కొందరికి కఠువుగా ఉండవచ్చు కాని నా వరకు నేను మహానటి చిత్రంను తీయడాని తప్పుడు నిర్ణయంగానే భావిస్తున్నాను అన్నారు. సినిమా మరియు జీవితం అనేవి పూర్తిగా వేరు. సావిత్రి పూర్తి జీవితాన్ని సినిమాలో చూపించడం నేను జీర్ణించుకోలేక పోతున్నాను అంటూ ఈ సందర్బంగా షావుకారు జానకిగారు అన్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.