మనీ, మద్యం లేకుండా ప్రజా రాజకీయాలు ఎలా చేయాలో జనసేన చేసి చూపించింది: లక్ష్మినారాయణ

వాస్తవం ప్రతినిధి: మనీ, మద్యం లేకుండా ప్రజా రాజకీయాలు ఎలా చేయాలో జనసేన చేసి చూపించిందన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మినారాయణ. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందన్నారు. ప్రజలకు ప్రతినిధిగా ఎవరు ఉండాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయించారని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం లేకుండా జనసేన ఎన్నికలకు వెళ్లి మార్పుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రజల మనసుకు దగ్గరగా వెళితే ఎన్నికలు అధ్బుతంగా జరిపించవచ్చని జనసేన నిరూపించిందని అన్నారు వీవీ లక్ష్మినారాయణ.