ఈ ఎన్నికల్లో 300 సీట్లు గెలవడం ఖాయం: మోదీ

వాస్తవం ప్రతినిధి: బిజెపి నేతృత్వంలోని అధికార కూటమి ఈ ఎన్నికల్లో 300 సీట్లు గెలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల చివరి ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. తనను తిరిగి ప్రధానిని చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోడీ చెప్పారు. కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకూ, కచ్‌నుంచి కామ్‌రూప్‌ వరకూ మొత్తం దేశమంతా ”అబ్‌ కీ బార్‌, 300 పార్‌, ఫిర్‌ ఏక్‌ బార్‌ మోడీ సర్కార్‌” అని నినదిస్తున్నారని ఆయన చెప్పారు.