కెసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు నమ్మే స్థితిలో లేరు అంటున్న జాతీయస్థాయి లీడర్..!

వాస్తవం ప్రతినిధి: దేశం అభివృద్ధి చెందాలంటే రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపి పార్టీలు దేశంలో ఉండకూడదని కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అయితే కచ్చితంగా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలకు దీటుగా భారత్ ఎదగడం ఖాయమని అని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు ఒంటరిగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో..ఆ సమయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా కెసిఆర్ ఎక్కువగా జాతీయ రాజకీయాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టి తాజాగా..జాతీయ స్థాయిలో ఉన్న నేతలను కలుస్తూ దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ప్రంట్ ను ఎవరూ నమ్మరని సిపిఐ ప్రదాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఐదేళ్లుగా బిజెపికి కెసిఆర్ మద్దతు ఇచ్చారని ఆయన విమర్శించారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసినా, కాంగ్రెస్,బిజెపి లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని ఆయన అభిప్రాయపడ్డారు.రాజ్యాంగ పరిరక్షణకోసం బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడే కూటమికి మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. పెడరల్ ప్రంట్ లో వామపక్షాలు కూడా కలవాలని కెసిఆర్ కేరళ వెళ్లి సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ ను కలిశారు. ఈ నేపద్యంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.